Coronavirus : 24 గంటల్లో 142 మంది మృతి.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 80 శాతం..

దేశంలో కరోనా సంక్రమణ వల్ల మరణించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Update: 2020-05-23 06:40 GMT
Representational Image

దేశంలో కరోనా సంక్రమణ వల్ల మరణించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 3726 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 142 మంది మరణించారు. ఇందులో ఇండోర్ కు చెందిన ఒక వైద్యుడు కూడా ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ 5 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. దేశంలో మొత్తం కరోనా మరణాలలో 80% ఇక్కడ నమోదయ్యాయి.

మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 1517 కు పెరిగింది. మహారాష్ట్రలో 63, గుజరాత్‌లో 29 మంది మరణించారు.. దాంతో గుజరాత్లో 802 కి చేరుకుంది. ఇక ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో కొత్తగా14 మంది మరణించారు, పశ్చిమ బెంగాల్‌లో 6, తెలంగాణలో 3, రాజస్థాన్‌లో 2, మధ్యప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కరు మరణించారు. ఢిల్లీ లో మరణించిన వారి సంఖ్య 200 దాటింది. ఇక్కడ మొత్తం 208 మంది మరణించారు. అదేవిధంగా, తమిళనాడులో మరణాల సంఖ్య 99 కి పెరిగింది.. కాగా గురువారం దేశవ్యాప్తంగా 148 మంది మరణించారు.

Tags:    

Similar News