Coronavirus: 28 రోజుల్లో 961 మరణాలు, 29 వేల కేసులు...

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కరోనావైరస్ మరణాల సంఖ్య వెయ్యి దాటింది.

Update: 2020-04-29 09:05 GMT
Representational Image

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కరోనావైరస్ మరణాల సంఖ్య వెయ్యి దాటింది. దేశంలో మొదటి సంక్రమణ కేసు జనవరి 30 న కేరళలో నమోదయింది. కొన్ని గణాంకాలను పరిశీలిస్తే, మొదటి కేసు వెలుగులోకి వచ్చిన 62 రోజులలో, మార్చి 31 వరకు, దేశంలో 50 మరణాలు సంభవించాయి. మొదటి మరణం మార్చి 11 న నమోదైంది. అప్పుడు సోకిన వారి సంఖ్య 1635. ఆ తరువాత సంక్రమణ మరింత వేగం పుంజుకుంది.. టెస్టింగ్ సామర్ధ్యం కూడా పెరగడం ఇందుకు కారణం. కేవలం 28 రోజుల్లో, కరోనా నుండి 961 మంది మరణించారు.. అంతేకాదు 29 వేల మందికి వ్యాధి సోకింది. ఈ విధంగా జనవరి 30 నుండి దేశంలో 1011 మంది మరణించగా, 30 వేల 635 మందికి వ్యాధి సోకింది.

ఇదిలావుంటే ఏప్రిల్ 28న అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయి.. దేశవ్యాప్తంగా 1903 మందికి సోకింది. ఇది ఒక రోజులో అత్యధిక రోగుల సంఖ్య. అదేవిధంగా, మరణాల పరంగా మంగళవారం చూస్తే నిన్న ఒక్కరోజే 71 మంది మరణించారు. ఈ క్రమంలో కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏదైనా ఉంది అంటే.. రికవరీ రేటు పెరగడమే.. కరోనా రోగుల రికవరీ రేటు కూడా నిరంతరం పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 23.83% చొప్పున కోలుకుంటున్నారు. చికిత్స తర్వాత ఇప్పటివరకు 7412 మందికి నయమైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇంతకుముందు కరోనాను నివేదించిన 17 జిల్లాలు.. గత 28 రోజుల్లో ఒక్క కేసు కూడా నివేదించలేదు.


Tags:    

Similar News