Coronavirus: కేరళలో 74శాతం రికవరీ రేటు

భారత్ లో మొట్టమొదట కరోనా భారిన పడిన రాష్ట్రం కేరళ.

Update: 2020-04-25 04:36 GMT
Representational Image

భారత్ లో మొట్టమొదట కరోనా భారిన పడిన రాష్ట్రం కేరళ. అన్ని రాష్ట్రాల కంటే ముందే కరోనా కేసులు నమోదైన ఈ రాష్ట్రంలో.. మహమ్మారి వ్యాప్తి కూడా అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తగ్గింది. ప్రస్తుతం కేసులు నిలకడగా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు ఒకటో రెండో కేసులు నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ 25 ఉదయం 8:00 గంటల వరకూ కేరళ రాష్ట్రంలో 2 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలలో పేర్కొంది. దీంతో కేరళలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 450 కి చేరింది. కాగా కాసర్గోడ్‌లో అత్యధికంగా 170 ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే నిన్నటివరకూ సోకిన వారిలో 331 మంది కోలుకున్నారు.. మొత్తం కేసులతో పోల్చితే రికవరీ రేటు 74 శాతంగా ఉంది. రాష్ట్రంలో కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు.. అందులో ఇద్దరికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 450 కేసులతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల కేసుల సంఖ్యను బట్టి 13 వ స్థానంలో ఉంది కేరళ. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా 6817 కేసులు ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో భారతదేశంలో 1,429 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి.. దాంతో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 24,506 కు చేరుకుంది. కొరోనావైరస్ గత 24 గంటల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 775 కు చేరుకుంది.


Tags:    

Similar News