135 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
ఢిల్లీలో 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) ట్రూపర్లకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
ఢిల్లీలో 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) ట్రూపర్లకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) అధికారులు శనివారం పేర్కొన్నారు.
135 మందికి కరోనా సోకడంతో బెటాలియన్ కు చెందిన నాలుగు వందల ఎనభై మంది సైనికులను నిర్బంధించారు. మరో 22 మంది సైనికుల పరీక్షా ఫలితాలు రావాల్సివుందని, మిగిలినవి క్లియర్ అయ్యాయని ఉన్నతాధికారులు తెలిపారు. రాజధానిలోని మయూర్‌విహార్ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లుంటారు. ఈ బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్స్‌పెక్టర్(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్ సోకి సప్థర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయారు. ఇదిలావుంటే వైరస్ పాజిటివ్ అని తేలిన వీరిలో చాలా మందికి లక్షణాలు లేకుండానే ఉంది. ఇది మరింత ఆందోళనను కలిగిస్తుంది.
అధిక సంఖ్యలో సైనికులు కరోనా భారిన పడడంతో దేశంలోని అన్ని అంతర్గత భద్రత మరియు శాంతిభద్రతల విధులను పర్యవేక్షించే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచనలు అందుతున్నాయి.