ఉత్తరప్రదేశ్‌లో మరోసారి పెరిగిన పాజిటివ్ కేసులు

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

Update: 2020-05-07 10:04 GMT

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో సోకిన వారి సంఖ్య 3159 కు పెరిగింది. ఇందులో 1824 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇందులో 1152 జమాత్‌తో సంబంధం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 60 కి పెరిగింది. ప్రాంతాల వారీగా కేసులు ఇలా ఉన్నాయి.. ఆగ్రాలో 655, కాన్పూర్‌లో 292, లక్నోలో 269, సహారాన్‌పూర్‌లో 205, గౌతమ్ బుద్ నగర్ (నోయిడా) లో 193, ఫిరోజాబాద్‌లో 177, మీరట్‌లో 174, మొరాదాబాద్‌లో 116, ఘజియాబాద్‌లో 110, వారణాసిలో 77, అలీఘర్, బులాండ్‌షహర్‌లో 50. రాయ్ బరేలిలో 57, హపూర్‌లో 47, మధుర, అమ్రోహా, బస్తీలో 36, బిజ్నోర్‌లో 34, సంత్కాబీరనగర్‌లో 30, షామ్లీలో 29, రాంపూర్‌లో 25, ముజఫర్ నగర్‌లో 24, సీతాపూర్‌లో 20, సంబల్, సిద్ధార్థనగర్, బాగ్‌పట్‌లో 19. 17- 17 మరియు 16 బడాన్, ప్రయాగ్రాజ్- బహ్రాయిచ్‌లో 15, బండా-ప్రతాప్‌గర్ లో 14 కేసులు బయటపడ్డాయి.

ఇదిలావుంటే యుపి ప్రభుత్వం మార్చి 25 న పాన్ మసాలాను నిషేధించే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.. కేవలం (నికోటిన్) పొగాకు అమ్మకాలపై మాత్రమే నిషేధం కొనసాగించింది. అంతేకాదు పొగాకు, నికోటిన్ కలిగిన పాన్ మసాలా, గుట్ఖాపై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.


Tags:    

Similar News