Coronavirus: భారత్ కు ఊరట కలిగించే విషయం ఇదే..

లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ భారత్ లో కరోనాకేసులు మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.

Update: 2020-04-19 02:25 GMT

లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ భారత్ లో కరోనాకేసులు మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ప్రస్తుతం కరోనా కేసులు 15.722 చేరుకున్నాయి. అంతేకాదు శనివారం నాటికి మరణించిన వారి సంఖ్య 521 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖప్రకారం, ఈ ప్రాణాంతక వ్యాధి నుండి ఇప్పటివరకు 2 వేల మంది కోలుకున్నారు.

నిన్న ఒకే రోజు దేశంలో గరిష్టంగా 1370 కరోనా వైరస్ కేసులు వచ్చాయి. ఇందులో మహారాష్ట్రలో 328, గుజరాత్‌లో 277, ఢిల్లీలో 186, ఉత్తరప్రదేశ్‌లో 125, రాజస్థాన్‌లో 122 మంది రోగులు ఉన్నారు. ఒక రోజు ముందు, శుక్రవారం, 920 కొత్త కేసులు వస్తే. ఏప్రిల్ 16 న 1062, ఏప్రిల్ 15 న 882, ఏప్రిల్ 14 న 1035 , ఏప్రిల్ 13న 1243 కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకూ అత్యధికంగా 3648 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇక్కడ అత్యధికంగా చనిపోయిన వారి సంఖ్య 211 గా ఉంది. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి.

ఇక ఊరట కలిగించే విషయం ఏమిటంటే, కరోనా భారిన పడిన వారు రికార్డు స్థాయిలో 423 మంది శనివారం కోలుకున్నారు. అయితే అంతకుముందు రోజు 304 మంది రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు, గురువారం 259 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇదిలావుంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో 14,792 కరోనా పాజిటివ్ రోగులు ఉన్నారని. వీరిలో 12,289 మంది చికిత్స పొందుతున్నారని, 2015 మందికి నయం కాగా, 488 మంది మరణించారని పేర్కొంది.


Tags:    

Similar News