అమెరికాలో అరుదైన ఘటన.. COVID-19 కారణంగా శిశువు మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే 30 వేల మందికి పైగా మరణించారు.

Update: 2020-03-29 05:40 GMT

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే 30 వేల మందికి పైగా మరణించారు.ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే 30 వేల మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే 30 వేల మందికి పైగా మరణించారు. 

ఈ మహమ్మారి ఎక్కువగా 60 ఏళ్ళు పైబడిన వారినే బలితీసుకుంటుంది. అయితే తాజాగా అమెరికాలో అరుదైన మరణం చోటుచేసుకుంది. సంవత్సరం లోపు ఉన్న పిల్లవాడిని కరోనా కాటు వేసింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అధికారులు శనివారం మాట్లాడుతూ, ప్రపంచ మహమ్మారి బాల్య మరణానికి కారణమైందని..

దీనిని అరుదైన కేసుగా గుర్తించినట్టు చెప్పారు. చికాగోలో మరణించిన పిల్లవాడు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు గలవాడు మరియు COVID-19 పాజిటివ్ అని తేలినట్టు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ తెలిపింది. కాగా ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు మాత్రం కరోనా లక్షణాలు లేవు.. అలాంటప్పుడు ఆ పిల్లవాడికి ఈ వ్యాధి ఎలా సంక్రమించిందా అని అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 6 లక్షల 64 వేలకు పైగా నమోదయ్యాయి. ఇందులో ఒక లక్షా 42 వేల మంది కోలుకున్నారు. అయితే మరణాలు మాత్రం ఆగడం లేదు.. తాజా లెక్కల ప్రకారం ప్రాంచవ్యాప్తంగా 30 వేల 883 మంది మరణించారు.


Tags:    

Similar News