Coronavirus: భారత్ లో 12 గంటల్లో 490 కొత్త కేసులు

భారతదేశం సోమవారం కరోనావైరస్ కారణంగా 109 మరణాలను నివేదించింది, అలాగే కోవిడ్ -19 పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 4067 కు పెరిగాయి.

Update: 2020-04-06 10:23 GMT

భారతదేశం సోమవారం కరోనావైరస్ కారణంగా 109 మరణాలను నివేదించింది, అలాగే కోవిడ్ -19 పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 4067 కు పెరిగాయి.గత 12 గంటల్లో 490 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కోవిడ్ -19 యొక్క 3,666 క్రియాశీల కేసులు ఉన్నాయి.. ఇందులో 291 మందికి నయం కావడంతో కొందరిని డిశ్చార్జ్ కూడా చేశారు. మరోవైపు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు..

కర్ణాటకలో మరో 12 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసులు 163 కు చేరాయి, వాటిలో 4 మరణాలు.. 18 డిశ్చార్జ్ లు ఉన్నాయి. కొత్తగా వచ్చిన 12 కేసులలో 3 కి ఢిల్లీకి ప్రయాణ చరిత్ర ఉంది.. ఇక మధ్యప్రదేశ్ లో మరో 9 మందికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది, వారిలో 5 మంది పోలీసు సిబ్బంది, 4 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. భోపాల్ లో ఇప్పటివరకు 54 మందికి పాజిటివ్ పరీక్షలు చేశారు, ఇందులో 1 మరణం కూడా ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయి. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం. 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 30 వరకు కేసులు నివేదించబడ్డాయి.


Tags:    

Similar News