Coronavirus: అంతర్రాష్ట్రీయ ప్రయాణాలకు ఐసీఎంఆర్ సూచనలు
Coronavirus: కరోనా మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించి అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.
Coronavirus: అంతర్రాష్ట్రీయ ప్రయాణాలకు ఐసీఎంఆర్ సూచనలు
Coronavirus: కరోనా మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించి అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఇతర రాష్ట్రాల వారు తమ ప్రాంతంలోకి ప్రవేశించాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేశాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అంతరాష్ట్ర ప్రయాణాలకు సంబందించి కీలక సూచనలు చేసింది. పూర్తి ఆరోగ్యంగా ఉండి ఒంటరిగా అంతరాష్ట్ర ప్రయాణాలు చేసేవారికి ఆర్‌టీపీసీఆర్ రిపోర్ట్ అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
తాజా ఉత్తర్వులు ఒంటరిగా అంతరాష్ట్ర ప్రయాణాలు చేసే వారికి ఊరటనిస్తాయి. లాక్‌డౌన్ విధించిన పలు రాష్ట్రాల్లో ప్రయాణాలకు ఈ పాస్ తప్పనిసరి చేసాయి. దాంతో సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలున్న వారు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరం అనుకున్న వారు టెస్ట్‌లకు వెళ్తున్నారు. దాంతో కోవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ మరింతగా పెరుగుతోంది. దేశంలో పెరుగుతున్న కేసులతో ఇప్పటికే పరీక్షా కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. దీన్ని తగ్గించడం కోసమే ఐసీఎంఆర్ ఈ ప్రకటన చేసింది.