భారత గబ్బిలాల్లో కరోనా వైరస్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అధ్యయనం ప్రకారం, భారతీయ గబ్బిలాలలో వ్యాధికారక కరోనావైరస్ ను గుర్తించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అధ్యయనం ప్రకారం, భారతీయ గబ్బిలాలలో వ్యాధికారక కరోనావైరస్ ను గుర్తించారు. భారతీయ గబ్బిలాలలో ఈ తరహా సూక్ష్మజీవులను గుర్తించడం ఇదే మొదటిసారి.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
అంతేకాదు ఈ తరహా గబ్బిలా ల్లోని రోగ నిరోధక వ్యవస్థ భిన్న రకాల వైరస్‌లను తిప్పికొట్టగలదని అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) చేసిన అధ్యయనంలో కేరళ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడులోని ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాల జాతులలో కరోనావైరస్ ఉన్నట్లు కనుగొనబడింది.
ఈ నాలుగు రాష్ట్రాల నుండి సేకరించిన రెండు గబ్బిలాల జాతులలో వైరస్ నిర్ధారణకు ఉపయోగించే 'రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ చైన్ రియాక్షన్' (ఆర్‌టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించినప్పుడు 'పాజిటివ్' ఫలితాలు వచ్చాయి. అయితే ఈ రకం కరోనా వైరస్ వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయా లేదా అన్నది మాత్రం పరిధోధకులు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఈ తరహా గబ్బిలాలు ఈ నాలుగు రాష్ట్రాల్లోనే కనిపించాయి.
తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ కనిపించలేదు. కేరళలో 2018 - 2019 లో వెలుగుచూసిన నిఫా వైరస్.. స్టెరోపస్ గబ్బిలాల జాతుల ద్వారా వచ్చిందని అప్పట్లో గుర్తించారు. కాగా చైనాలోని వుహాన్ నుండి వ్యాపించిన కరోనావైరస్ మహమ్మారి గబ్బిలాల నుండి ఉద్భవించిందని అధ్యయనాలు , సిద్ధాంతాలు ఉన్నాయి.