Coronavirus: పాపం ఇటలీకి.. ఇదొక్కటే ఊరట కలిగించే వార్త..

కరోనావైరస్ మహమ్మారి ఐరోపాలో కనికరం లేకుండా ప్రబలుతోంది. ప్రస్తుతం ఇటలీలో కేసుల సంఖ్య దాదాపు 60 వేలకు చేరుకుంది.

Update: 2020-03-23 06:58 GMT
coronavirus deaths

కరోనావైరస్ మహమ్మారి ఐరోపాలో కనికరం లేకుండా ప్రబలుతోంది. ప్రస్తుతం ఇటలీలో కేసుల సంఖ్య దాదాపు 60 వేలకు చేరుకుంది.ఆదివారం ఒకే రోజులో 651 మంది మరణించినట్లు ఇటలీ ఆరోగ్యశాఖ ప్రకటించింది, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,476 కు చేరుకుందని తెలిపింది. ఇది 13.5 శాతం పెరుగుదల, కానీ శనివారం మాత్రం 793 మంది మరణించిన సంఖ్య చూసుకుంటే ఇది తక్కువనే చెప్పాలి. అయితే ఊరట కలిగించే వార్త ఏమిటంటే 7 వేల మందికి పైగా వ్యాధిగ్రస్థులు కోలుకున్నారు. ఇటలీలో ఫ్రిబ్రవరి 15 న మూడు కేసులతో మొదలైన కరోనా ఇప్పుడు అరవైవేల మందికి సోకడం ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైన ఇటలీ.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో బిక్కిబిక్కుమంటోంది.

ఉత్తర ఇటలీలోనే లంబార్డె ప్రాంతంలోనే అత్యధికంగా కోవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్రంగా ప్రభలిందని వైద్యులు అంటున్నారు. రోజురోజుకు గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు, వాటిని పూడ్చేందుకు స్థలాలు లేక అసలు ఆ మృతదేహాలను పూడ్చడానికి ఎవరు రాకపోవడంతో.. చివరికి సైన్యం రంగంలోకి దిగి ఖననం చేస్తోంది.

మరోవైపు.. ఇటలీనీ ఆదుకునేందుకు భారత్‌ ముందుకొచ్చింది. ఆ దేశానికి వైద్య పరికరాలు, మాస్కులు పంపించి పెద్దమనసును చాటుకుంది. భారత్‌ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది ఆ దేశ విదేశాంగ శాఖ. ఇక ప్రపంచవ్యాప్తంగా, COVID-19 నుండి 13,000 మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన 304,500 మందిలో 92,000 మంది కోలుకున్నారు.

ఇదిలావుంటే కొరోనావైరస్ యునైటెడ్ స్టేట్స్లో గత 24 గంటల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, దీంతో మొత్తం 389 మంది మరణించారు, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక లెక్క ప్రకారం. న్యూయార్క్ (114 మరణాలు), వాషింగ్టన్ (94 మరణాలు) మరియు కాలిఫోర్నియా (28 మరణాలు)లో నమోదయ్యాయి. కొన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇప్పటివరకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వైరస్ దేశవ్యాప్తంగా 30,000 మందికి సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News