వామ్మో .. బాబు పేరు లాక్‌డౌన్‌.. పాప పేరు కరోనా అంట

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Update: 2020-04-01 15:57 GMT
Baby

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అలాంటిది ఓ కుటుంబం మాత్రం పసిబిడ్డకు ఏకంగా కరోనా అని పేరు పెట్టారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలోని ఓ మహిళకు మార్చి 30వ తేదీన ఓ బాబు పుట్టాడు. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రులు 'లాక్ డౌన్'అని పేరు పెట్టారు. లాక్ డౌన్ సమయంలో బాబు పుట్టాడు. దేశ ప్రజల క్షేమం కోసం మోదీ తీసుకున్న 'లాక్ డౌన్' పేరును మా బాబుకు పెట్టాం' అని ఆ బాలుడి తండ్రి పవన్ చెప్పారు.

మరోవైపు యూపీలోని గోరఖ్‌పూర్‌లో పుట్టిన పసిబిడ్డకు కరోనా' అని పేరు పెట్టాడు ఆ పాప మేనమామ నీతిష్ త్రిపాఠీ. పాపకు కరోనా పేరు పెట్టేందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్టు చెప్పాడు. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఐక్యం చేసిందని నితీష్ అంటున్నాడు. మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజునా పాప పుట్టిందని అందుకే పాపకు కరోనా పేరు పెట్టినట్లు వెల్లడించాడు. ఎన్నో మంచి అలవాట్లు కూడా నేర్పిందని అంటున్నాడు. కరోనా మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు నితీష్ చెప్పాడు.

Tags:    

Similar News