Sonia Gandhi: కాంగ్రెస్ గ్యారంటీలతో మహిళల జీవితాలు మారిపోతాయ్
Sonia Gandhi: తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ గ్యారంటీల వల్ల... అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని సోనియా
Sonia Gandhi: కాంగ్రెస్ గ్యారంటీలతో మహిళల జీవితాలు మారిపోతాయ్
Sonia Gandhi: తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే తాము అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని సోనియా పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి విప్లవాత్మక చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులకు కాంగ్రెస్ పార్టీ సాధికారత కల్పించిందన్నారు. మహాలక్ష్మి ద్వారా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.