రాహుల్ గాంధిని అరెస్ట్ చేసే అవకాశం

Update: 2019-08-24 05:10 GMT

జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయన్న కారణంతో భద్రతా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్ తోపాటు గులాంనబీ ఆజాద్, సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ల బృందం ఇవాళ కాశ్మీర్ లో పర్యటించనుంది. ఇందుకోసం ఈ బృందం ఢిల్లీ నుంచి కాశ్మీర్ కు బయలుదేరింది. అయితే కాశ్మీర్ లో దిగి దిగగానే వీరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

Tags:    

Similar News