పార్లమెంటు పీఏసి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ ఎంపీ

లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధికర్ రంజన్ చౌదరిని పబ్లిక్ అకౌంట్స్ పార్లమెంటరీ కమిటీ (పిఎసి) చైర్‌పర్సన్‌గా నియమించారు.

Update: 2020-05-06 02:43 GMT
Congress leader Adhir Ranjan Chowdhury (File photo)

లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని పబ్లిక్ అకౌంట్స్ పార్లమెంటరీ కమిటీ (పిఎసి) చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆయన పదవీకాలం 2020 మే 1 నుండి ప్రారంభించి, 2021 ఏప్రిల్ 30 తో ముగుస్తుందని పార్లమెంటు ప్రకటించింది. అంతేకాదు ఈ కమిటీలో కాంగ్రెస్ నుండి ఆయనే ఏకైక సభ్యుడిగా ఉన్నారు. లోక్ సభ సచివాలయం నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం ఈ నియామకాన్ని చేశారు.

పిఎసికి లోక్ సభ నుండి 15 మంది సభ్యులు ఉండగా, రాజ్యసభ నుండి ఏడుగురు సభ్యులు ఉన్నారు. బిజెపి నుండి లోక్సభ సభ్యులు - జయంత్ సిన్హా, అజయ్ (టెని) మిశ్రా, సుధీర్ గుప్తా, దర్శన విక్రమ్ జర్దోష్, సత్య పాల్ సింగ్, సుభాష్ చంద్ర బహేరియా, విష్ణు దయాల్ రామ్, జగదాంబిక పాల్ మరియు రామ్ కృపాల్ యాదవ్ ఉన్నారు.

ఇతర పార్టీల సభ్యులలో టిఆర్ బాలు, రాహుల్ రమేష్ షెవాలే, రాజీవ్ రంజన్ సింగ్, బాలశౌరీ వల్లభనేని, భర్త్రుహరి మహతాబ్ ఉన్నారు. ఇక రాజ్యసభ నుండి పిఎసికి నియమించిన సభ్యులు రాజీవ్ చంద్రశేఖర్, సిఎం రమేష్, నరేష్ గుజ్రాల్, సుఖేందు శేఖర్ రాయ్ మరియు భూపేందర్ యాదవ్ ఉన్నారు.. ఇంకా ఇద్దరిని చేర్చుకునే వెసులుబాటు ఉంది. ఇదిలావుంటే పార్లమెంట్ లో పీఏసి చైర్‌పర్సన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను ఎంపిక చెయ్యడం ఆనవాయితీగా వస్తోంది.


Tags:    

Similar News