TOP 6 NEWS @ 6PM: క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన ఎస్సీలు కూడా బీసీల కిందకే - రేవంత్ రెడ్డి
క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన ఎస్సీలు కూడా బీసీల కిందకే - రేవంత్ రెడ్డి
1) Caste Census In Telangana: క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన ఎస్సీలు కూడా బీసీ-సి గ్రూప్ కింద ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీల జనాభా తగ్గిందని వస్తోన్న ఆరోపణలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులగణన లెక్కలు పూర్తయితే, ఎవరికి ఏం రావాలో అది అడుగుతారనే భయంతోనే బీజేపి, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని అన్నారు. "ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఏ రకంగా తప్పో చెప్పండి" అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు. ఏ బ్లాకులో, ఏ ఇంట్లో, ఏ కులాన్ని ప్రభుత్వం తప్పుగా రాసుకొచ్చిందో కులగణను తప్పుపట్టే వారు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది అంత ఆషామాషి విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కులగణన గణాంకాలు పూర్తి చేస్తే... దేశచరిత్రలో తన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీనవర్గాల లెక్క పక్కాగా తేల్చారు అని దేశమంతా రాబోయే రోజుల్లో చెప్పుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం చేస్తోన్న కులగణన సర్వేకు అంతటి ప్రాధాన్యం ఉందని ఆయన చెప్పారు.
2) SLBC Tunnel collapsed: ఎస్ఎల్‌బీసీ సొరంగం 14వ కిలో మీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శనివారం ఉదయం 8:30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన హెలీక్యాప్టర్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సొరంగంలో ఒకవైపు బోరింగ్ మెషిన్ ఆన్ చేశారని, ఆ నీరు పైకి చిమ్మడం వల్లే సొరంగంలో మట్టి కుంగిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిలో జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ వాసుల వారే ఉన్నారని అధికారులు తెలిపారు. లోపల చిక్కుకున్న వారిలో సహాయ బృందాలు కొంతమందిని బయటికి తీసుకొచ్చి శ్రీశైలంలోని జెన్కో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందుతోంది.
3) APPSC Group 2 Exams: ఏపీలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా... ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
APPSC Group 2 Exams: ఏపీలో రేపు ఫిబ్రవరి 23న జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించడం ఏంటని కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వారి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటూ ఏపీపీఎస్సీకి ఈ లేఖ రాసింది.
ప్రస్తుతం అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తోన్న రోస్టర్ సమస్య కోర్టు విచారణలో ఉంది. వచ్చే నెల 11న ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రానుంది. దీంతో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఇంకొన్ని రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
4) New coronavirus in China: చైనాలో ప్రాణాంతకమైన మరో కొత్త కరోనావైరస్
HKU5-CoV-2 in China: కరోనావైరస్ మిగిల్చిన విషాదం నుండి ప్రపంచం ఇంకా తేరుకోనేలేదు తాజాగా చైనా నుండి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. చైనాలోని గబ్బిలాల్లో ప్రాణాంతకమైన మరో కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించారు. ప్రాణాంతకమైన వైరస్ అని ఎందుకంటున్నారంటే... ఈ వైరస్ సోకిన వారిలో మూడోవంతు జనాన్ని చంపేసేంత శక్తి ఈ వైరస్‌కు ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
చైనాకు చెందిన షి జెంగ్లీ అనే వైరాలజిస్ట్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించింది. ఈ కొత్త వైరస్ వేరియంట్‌ను HKU5-CoV-2 అని పిలుస్తున్నారు. మనుషుల్లో గతంలో వచ్చిన కరోనావైరస్ వేరియంట్స్ కంటే ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని షి జెంగ్లీ తెలిపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) IND vs PAK: టీం ఇండియాతో జరిగే మ్యాచ్ కు ఈ ఆటగాళ్లు దూరం.. పాకిస్తాన్ ప్లేయింగ్ 11 ఇదే
IND vs PAK: బాబర్ ఆజం భారత్‌పై పరుగుల వరద పారిస్తాడా.. షహీన్ షా అఫ్రిది బంతితో విధ్వంసం సృష్టిస్తాడా.. మహ్మద్ రిజ్వాన్ తన కెప్టెన్సీతో మ్యాచ్‌ను మలుపుతిప్పుతాడా.. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు తరపున ఎవరు బాగా రాణిస్తారో రేపు తెలుస్తుంది. కానీ దానికి ముందు భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దుబాయ్‌లో జరగనున్న ఈ ఆసక్తికర మ్యాచ్‌లో కొందరు స్టార్ ప్లేయర్లు దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు భార్యతో జెలెన్‌స్కీ.. మస్క్ ట్వీట్ వైరల్
Volodymir Zelensky's wife Olena Zelensky's cover page story on Vogue: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై మూడేళ్లు దాటింది. రెండు వైపులా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఫిబ్రవరి 13 నాటికి ఉక్రెయిన్ అధికారిక లెక్కల ప్రకారం రష్యా సైనికులు, ఉక్రెయిన్ సైనికులు, ఉక్రెయిన్ పౌరులు కలిపి మొత్తం 1,48,359 మంది చనిపోయారు. అందులో 46000 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. మరో 3 లక్షల 90 వేల మంది యుద్ధంలో గాయపడినట్లు ఆయనే ప్రకటించారు.
అయితే, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంత భీకర యుద్ధం నడుస్తోంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్యతో కలిసి ఏం చేశారో తెలుసా అంటూ ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఓవైపు యుద్ధంలో పిల్లలు చనిపోతుంటే మరోవైపు జెలెన్ స్కీ చేసిన పని ఇదని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో వోగ్ ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజ్ ఫోటోతో కూడిన డైలీ మెయిల్ వార్తా కథనాన్ని జత చేశారు. ఎలాన్ మస్క్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.