చిన్మయానంద బీజేపీ నాయకుడు కాదు!
చిన్మయానంద బీజేపీ నాయకుడు కాదచిన్మయానంద బీజేపీ నాయకుడు కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి హరీష్ శ్రీవాత్స స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామని, తమ పార్టీ చెందిన వ్యక్తి కాదని, ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
చిన్మయానంద బీజేపీ నాయకుడు కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి హరీష్ శ్రీవాత్స స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామని, తమ పార్టీ చెందిన వ్యక్తి కాదని, ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
అయితే ఇటీవలె చిన్మయానందపై ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన న్యాయ విద్యార్ధిని లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిన్మయానందతో పాటు సచిన్ , విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే చిన్మయానందను డబ్బుకోసం బెదిరించిన విద్యార్థినిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమెకు 14రోజులు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే చిన్మయానంద వాజపేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు.