Central vista project: కొత్త పార్లమెంట్ నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్!
Central Vista Project: * 20వేల కోట్లతో పార్లమెంట్ కొత్త భవనం * పార్లమెంట్ భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయన్న సుప్రీంకోర్టు
Supreme Court (file image)
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్ కొత్త భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం నిర్మించే పార్లమెంట్ భవనం న్యాయసమ్మతమేనని సుప్రీం తెలిపింది. త్రిసభ్య ధర్మాసనంలో మెజార్జీ జడ్జీలు సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పునివ్వడంతో పార్లమెంటు నూతన భవనం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది.