ఉల్లి ధరల నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి.

Update: 2019-11-09 15:42 GMT

దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఉల్లిపాయల ధరలు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. మార్కెట్లో కిలో ఉల్లిపాయలు రూ.60 నంచి రూ80 వరకు పలుకుతుంన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర రూ.100 ఉంది.

ఈ నేపథ్యంలో కేంద్రం సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. లక్ష టన్నుల ఉల్లిపాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఢిల్లో కార్యదర్శలు కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15లోగా ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేస్తామని, ఉల్లి ధరలు నియంత్రించడానికి లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 15లోగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంఎంటీసీకి సూచించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని సరఫరా చేసే బాధ్యతలు నాఫేడ్ సంఘానికి అప్పగించినట్లు ట్వీట్ లో తెలిపారు.

  


Tags:    

Similar News