ఇకనుంచి వైద్యసిబ్బందిపై దాడి చేస్తే జైలు శిక్షే..!

కోవిడ్ -19 బాధితులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య కార్యకర్తపై దాడి చేసే ఏ వ్యక్తినైనా గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్షించే ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం బుధవారం తీసుకువచ్చింది.

Update: 2020-04-22 10:50 GMT
Prakash Javadekar

కోవిడ్ -19 బాధితులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య కార్యకర్తపై దాడి చేసే ఏ వ్యక్తినైనా గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్షించే ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం బుధవారం తీసుకువచ్చింది. శతాబ్దం నాటి అంటువ్యాధి చట్టాన్ని సవరించడానికి ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్ దీనిపై సమాచారం ఇచ్చారు.

ఆరోగ్య కార్యకర్తలు మరియు ఇతర కరోనా యోధులను కాపాడటానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చాము.. కొత్త చట్టం ప్రకారం, ఆరోగ్య కార్యకర్తలపై దాడి అనేది బెయిల్ ఇవ్వలేని నేరంగా పరిగణించాలి. అని పేర్కొన్నారు.

శిక్షలు ఇలా ఉన్నాయి..

సాధారణ కేసులు :

జైలు శిక్ష: 3 నెలల నుండి 5 సంవత్సరాల

జరిమానా: రూ .50,000 నుండి రూ .2 లక్షలు.

తీవ్రమైన కేసులు :

జైలు శిక్ష: 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు

జరిమానా: రూ .1 లక్ష నుంచి రూ .7 లక్షలు.

ఆరోగ్య కార్యకర్తల వాహనాలు,  క్లినిక్‌లకు నష్టం జరిగితే, దోషులు జరిమానా చెల్లించవలసి ఉంటుంది, అంతేకాదు మార్కెట్ రేటు కంటే ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలి.

ఇదిలావుంటే దేశంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమ క్రమంగా పెరిగి 20,386 కు చేరుకుంది. ఇప్పుడు అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా 17 దేశాల సరసన భారత్ కూడా చేరింది, ఇక్కడ 20,000 కి పైగా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడంతో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తాజాగా నమోదైన కేసులలో రాజస్థాన్‌లో 64, గుజరాత్‌లో 94, ఆంధ్రప్రదేశ్‌లో 56, పశ్చిమ బెంగాల్‌లో 31, ఒడిశాలో 3 మంది కొత్త రోగులు ఉన్నారు. మరోవైపు, గుండె చికిత్స కోసం చండీగర్ కు చెందిన 6 నెలల బాలికకు కరోనా సోకింది.


Tags:    

Similar News