అభినందన్‌ వీడియోలను తొలగించిన యూట్యూబ్‌

Update: 2019-02-28 13:17 GMT

పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌కు సంబంధించిన వీడియోలను ఉన్నపలంగా తొలగించాలని సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి అభినందన్‌ కు సంబంధించిన వీడియోలు ఎవ్వరు ఇతర మాధ్యమాల్లోకూడా అప్లోడ్ చెయ్యొద్దని కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. కాగా పాక్‌ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో భారత్ కు చెందిన మిగ్‌-21 విమానాన్ని పాక్ అక్రమంగా కూల్చివేసింది.

ఈ ప్రమాదంలో పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌పై స్థానికులు దాడి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలోవీడియో చిత్రీకరణ చేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ వీడియోలను పాక్‌ ఆర్మీ రిలీజ్‌ చేసింది. అయితే ఇవి అభ్యంతకరంగా ఉన్నాయని కేంద్రం భావించింది. దీనిలో భాగంగానే ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన యూట్యూబ్‌.. అభినందన్‌కు సంబంధించిన వీడియోలను తొలగించినట్లు తెలిపింది.

Similar News