Cancer survey: ఆ ఒక్కచోటే 14,542 మంది మహిళల్లో క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు!

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వేలాది మంది మహిళల్లో క్యాన్సర్‌కు సంబంధించిన అనుమానిత లక్షణాలు బయటపడటం కలవరపాటుకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంజీవని పథకం కింద క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నిర్వహించిన స్క్రీనింగ్‌ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడైంది.

Update: 2025-07-10 13:10 GMT

ఈ వివరాలను ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాశ్ అబిత్కర్ మహారాష్ట్ర అసెంబ్లీలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 8వ తేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 2,92,996 మంది మహిళలపై సర్వే నిర్వహించగా, అందులో 14,542 మందిలో క్యాన్సర్‌కు అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.

స్క్రీనింగ్‌ మరియు తదుపరి పరీక్షల అనంతరం, ముగ్గురికి గర్భాశయ క్యాన్సర్‌, ఒకరికి రొమ్ము క్యాన్సర్‌, ఎనిమిది మందికి నోటి క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. హింగోలి జిల్లా కలెక్టర్‌ చొరవతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.

అయితే, మహిళల కోసం ప్రత్యేక క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేసే యోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ నిర్ధారణ కోసం వైద్య శిబిరాలు, స్క్రీనింగ్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అదే విధంగా, జిల్లా ఆసుపత్రులు మరియు ప్రభుత్వ వైద్య కళాశాలలలో క్యాన్సర్‌ చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. టాటా మెమోరియల్‌ ఆసుపత్రిలో శిక్షణ పొందిన 'క్యాన్సర్ వారియర్స్' ప్రతి నెలా రెండుసార్లు నిపుణుల బృందంతో కలిసి 11 ఆసుపత్రులకు సందర్శనలు చేస్తారని చెప్పారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో డే కేర్ కీమోథెరపీ కేంద్రాలు ప్రారంభించామని, మిగిలిన జిల్లాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతోందని వెల్లడించారు.

Tags:    

Similar News