సమయానికి అంబులెన్స్ రాక ప్రముఖ మరాఠీ నటి మృతి

సమయానికి అంబులెన్స్ రాక వర్ధమాన మరాఠీ నటి మృతి చెందింన సంఘటన తన అభిమానుల్లో విషాదాన్ని నింపింది.

Update: 2019-10-22 05:57 GMT

సమయానికి అంబులెన్స్ రాక వర్ధమాన మరాఠీ నటి మృతి చెందింన సంఘటన తన అభిమానుల్లో విషాదాన్ని నింపింది. మహారాష్ట్రకు 590 కిలోమీటర్ల దూరంలోని హింగోలి జిల్లాకు చెందిన పూజా జుంజార్ (25) మరాఠీ చిత్రాల్లో నటించింది. తను గర్భవతి కావడంతో కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా వుంది. ఈ నేపద్యంలోనే పూజాకు పురుటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ప్రసవం కోసం ఆమెను మొదట గోరేగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

అక్కడ తీసుకెళ్ళిన కాసేపటికే బిడ్డకు జన్మనిచింది. పుట్టిన బిడ్డ కాసేపటికే తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది.అదే క్రమంలో పూజా జుంజార్ పరిస్థితి కూడా విషమించడంతో వెంటనే హింగోలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారు. అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హింగోలీ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేదు.

దీంతో ఆమె బంధువులు ఓ ప్రైవేటు అంబులెన్స్ ను మాట్లాడి పెద్దాసుపత్రికి తరలించే ప్రయత్నం చేసారు. అయినా ఫలితం దక్కలేదు మార్గమధ్యంలోనే ఆ వర్ధమాన నటి తన ప్రాణాలను కోల్పోయింది.సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో వైద్యం అందక తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబీకులు కన్నీరుమున్నీ రావుతున్నారు.


Tags:    

Similar News