Bangalore: బెంగళూరులో కుప్పకూలిన ఓ భవనం

Bangalore: బెంగళూరులో ఓ భవనం కుప్పకూలింది. అంద‌రూ చూస్తుండ‌గానే భ‌వ‌నం కూలిపోయింది

Update: 2021-09-27 09:23 GMT

బెంగుళూరు లో కుప్పకూలిన భవనం (ఫైల్ ఇమేజ్)

Bangalore: బెంగళూరులో ఓ భవనం కుప్పకూలింది. అంద‌రూ చూస్తుండ‌గానే భ‌వ‌నం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను కొంద‌రు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ఈ భ‌వ‌నం ముందే ఒక‌వైపు వంగిపోవ‌డంతో స్థానికులు ఇచ్చిన సమాచారం అగ్నిమాప‌క సిబ్బంది అక్కడికి చేరుకుని అంద‌రినీ ఖాళీ చేయించారు. ఆ త‌ర్వాత కాసేప‌టికే భ‌వ‌నం కుప్పకూలింది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం గానీ, ఏ ఒక్కరూ గాయ‌ప‌డ‌టం గానీ జ‌రిగి ఉండ‌ద‌ని అధికారులు చెబుతున్నారు.

Full View


Tags:    

Similar News