మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్వీస్ట్

Update: 2019-11-10 14:21 GMT
Devendra Fadnavis

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ వెనకడుగు వేసింది. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. ఈ మేరకు గవర్నర్ ను కలిసిన ఆపధర్మ ముఖ‌్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విషయం తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. నవంబర్ 11 సోమవారంలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గడవు విధించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆపధర్మ సీఎం ఫడ్నవిస్‌ నివాసంలో సమావేశమయిన బీజేపీ కోర్‌ కమిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని నిర్ణయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత సంఖాబలం లేదని సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ- శివసేన కూటమి 162 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్సీపీ 54 కాంగ్రెస్‌ 44 సీట్లు ఇతరులు 21స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తమపార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీవైపు చూడకుండా ఉండలాని ఆ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెర లేపిందని ఆరోపణలు వచ్చాయి. దానిని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు విషయం తెలిసిందే.

అయితే ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పొత్తు కుదరలేదు. శివసేన ప్రతిపాదించిన ఫిఫ్టీ- ఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో శివసేన వెనక్కి తగ్గింది. ఆపార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ ప్రత్యర్థి పార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ని కూడా కలిశారు. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పలు కీలక వాఖ్యలు చేశారు. తాజాగా ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహానాన్ని బీజేపీ తిరస్కరించింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొనివుంది. 

Tags:    

Similar News