అమిత్ షా కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్నికల ముందు శివసేనతో సీఎం కుర్చీపై ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు

Update: 2019-11-13 14:54 GMT
Amit Shah

మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్నికల ముందు శివసేనతో సీఎం కుర్చీపై ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు. ఓ ప్రముఖ వార్తసంస్థతో ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, తాను బీజేపీ గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని చెప్పామని తెలిపారు. ఆ సమయంలో శివసేన పార్టీ నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని షా వెల్లడించారు.

రాష్ట్రపతి పాలన అనంతరం తొలిసారి మాట్లాడిన షా ఏ రాష్ట్రంలోనైనా ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు 18 రోజుల్లోగా చేయాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు 8వ తేదీనే ముగిసిందని, శాసనసభ గడువు ముగిసిన తర్వాతే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను ఆహ్వానించారన్నారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఏపార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయని తెలిపారు. కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాదులు కూడా ప్రభుత్వ ఏర్పాటును తిరస్కరించారనడం వారి విజ్ఞతకే వదలివేస్తున్నామన్నారు. శివసేన డిమాండ్లు తాము అంగీకరించమని తేల్చి చెప్పారు. ఏపార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం ఉంటే గవర్నర్ ను కలవచ్చునని అమిత్ షా అన్నారు. 

Tags:    

Similar News