మహారాష్ట్ర : అసెంబ్లీ సమావేశానికి చకచక ఏర్పాట్లు

అసెంబ్లీలో ప్రొటెం స్వీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలంబకర్‌ నియమించారు

Update: 2019-11-26 13:47 GMT

మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. సీఎం ఫడ్నవిస్‌ రాజీనామా చేసిన తర్వాత గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శాసనసభ సమావేశానికి ఆదేశించారు.అసెంబ్లీ బలపరీక్ష చేపట్టేందుకు గవర్నర్ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఏర్పాట్లుకు ఆదేశించారు. అసెంబ్లీలో ప్రొటెం స్వీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలంబకర్‌ నియమించారు. నిబంధనలు ప్రకారం శాసన సభలో సినీయర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్వీకర్‌గా నియమిస్తారు. దీంతో బుధవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేతో కాళిదాస్ ప్రమాణ స్వీకారం చేయించున్నారు. 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొని ఉండడంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దృష్టిలో ఉంచుకుని రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని గవర్నర్ ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష నిర్వహిస్తారు.

మంగళవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశించింది. ఆ ఓటింగ్‌ రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదని, లైవ్ కవరేజీ ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. 

Tags:    

Similar News