BJP: పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్

BJP: దేశ వ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్రలకు శ్రీకారం

Update: 2023-12-17 04:12 GMT

BJP: పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్

BJP: వచ్చే ఏడాదిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ కార్యక్రమం జనవరి 26 వరకు కొనసాగనుంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా 2047 వరకు దేశం అగ్రగామి దేశంగా అవతరించడమే టార్గెట్‌గా అడుగులు వేస్తున్నామంటూ తెలిపారు ప్రధాని మోడీ.

ఇక తెలంగాణలో కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు బీజేపీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శనివారం చిన్న గోల్కొండలో వికసిత్ యాత్రను ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 రోజుల పాటు 163 వాహనాలు తిరిగేలా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 వేల సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర బీజేపీ. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడం, వివిధ పథకాలకు కొత్త లబ్ధిదారులను నమోదు చేయడం టార్గెట్‌గా ఈ యాత్ర కొనసాగనుంది.

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేశారు. పార్లమెంటు ప్రవాస యోజనలో ఉన్న కేంద్ర మంత్రులు ఈ యాత్రలో మూడు రోజులైనా పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ సక్సెస్ అవుతుందా లేదా అనేది వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తేలనుంది.

Tags:    

Similar News