BJP: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. రెండో జాబితాపై సీఈసీ కసరత్తు

BJP: వివిధ రాష్ట్రాల్లో 150 మందికి పైగా అభ్యర్థుల ఎంపిక

Update: 2024-03-11 10:49 GMT

BJP: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. రెండో జాబితాపై సీఈసీ కసరత్తు

BJP: రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్తానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్ధుల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ మిగిలిన 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎనిమిది మంది అభ్యర్ధుల ఎంపికపై అధిష్టానానికి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాంనాయక్, నగేష్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, ఆరూరి రమేష్, గాయకుడు మిట్టపల్లి సురేంద్రలు బీజేపీలో చేరడంతో వారికి పార్టీ టికెట్టు ఖరారు చేసినట్టు తెలిసింది.

మహూబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి నగేష్, వరంగల్ నుంచి కృష్ణప్రసాద్, పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేంద్ర ల్లో ఒకరు, మెదక్ నుంచి రఘునందన్ రావు, నల్లగొండ నుంచి సైదిరెడ్డిని బరిలో నిలుపాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మహబూబ్ నగర్ కోసం డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు.

Tags:    

Similar News