ఉపఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... జాబితాలో వారికే ప్రాధాన్యత

Update: 2019-11-14 11:13 GMT
Bjp Karnataka

కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ నుంచి అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు గురువారం సీఎం యాడ్యురప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని బుధవారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ కూటమి కూలిపోయి యాడ్యురప్ప సర్కార్ అధికారం చేపట్టింది. అయితే అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అంతే కాకుండా 2023 ఎన్నికల వరకూ పోటీ చేయడానికి అనర్హులని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనర్హత సమజసమే అంటూ సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎన్నికలు ఎప్పుడ వచ్చిన తిరిగి పోటీ చేయవచ్చునని తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పు అనంతరమే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికలకు నగరా మోగింది. ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే డిసెంబర్ 5వతేదీన ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ ఉపఎన్నికలకు  బీజేపీ 13 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు స్థానాలకు సంబంధించి పిటిషన్ల దాఖలైయ్యాయి దీనిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆ రెండు స్థానాలు మినహా మిగత చోట్లు ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఉపఎన్నికల్లో గెలిచి సుస్థిర పాలన అందించాలని బీజేపీ చూస్తుంది. మరోవైపు కాంగ్రెస్ - జేడీఎస్ కూడా ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉపఎన్నికల్లో మోజార్టీ స్థానాల్లో విజయం సాధించి బీజేపీకి గుణపాఠం చేప్పాలని జేడీఎస్ కాంగ్రెస్ పార్టీలు యోచిస్తున్నాయి.



Tags:    

Similar News