Elections: మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో నేరుగా తలపడనున్న బీజేపీ-కాంగ్రెస్

Elections: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు పోటీ

Update: 2023-10-09 04:45 GMT

Elections: మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో నేరుగా తలపడనున్న బీజేపీ-కాంగ్రెస్

Elections: ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల కానుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుండటంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది.

ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లోనూ ఈ సంవత్సరం చివరి నాటికి అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. జమిలి ఎన్నికలకు ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి... ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను.. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల ముందు.. ట్రైలర్ లాగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టీ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో కొంతవరకూ అంచనా వెయ్యడానికి వీలవుతుంది.

5 రాష్ట్రాల ఎన్నికలను అత్యంత పగడ్బంధీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో BRS అధికారంలో ఉండగా.. రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఉండగా.. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ అధికార, విపక్షాల మధ్య పోటీ హైరేంజ్‌లో ఉంది. అందుకే ఈ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 

Tags:    

Similar News