Bill Gates: ప్రధాని మోదీకి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లేఖ

కోవిడ్ -19 సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్ తీసుకున్న చర్యలను అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదికి ఒక లేఖ రాశారు.

Update: 2020-04-23 01:44 GMT
Bill Gates, PM Narendra Modi

కోవిడ్ -19 సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్ తీసుకున్న చర్యలను అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదికి ఒక లేఖ రాశారు.లేఖలో పలు అంశాలు ప్రస్తావించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యలను మేము అభినందిస్తున్నాము అని అందులో పేర్కొన్నారు బిల్ గేట్స్. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు.. మోదీ తీసుకున్న దేశవ్యాప్త లాక్ డౌన్ మంచి నిర్ణయమన్నారు. అలాగే ఎక్కడిక్కడ రోగులను ఐసోలేషన్ చెయ్యడం, వైరస్ సోకిన ప్రాంతాలను హాట్‌స్పాట్ లు గా గుర్తించి..

ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడటం, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడం వంటి చర్యలు మోదీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. అంతేకాదు ఇంతపెద్ద విపత్కర సమయంలో ఆరోగ్య సేతు లాంటి అసాధారణమైన డిజిటల్ సేవలు ఉపయోగించుకోవడం నిజంగా ప్రశంసనీయమని అన్నారు. వైరస్.. ఒకరినుంచి మరొకరికి రాకుండా ప్రజలకు సామాజిక భద్రత కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు గేట్స్. కాగా భారతదేశానికి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా కరోనా కట్టడికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News