Bihar: బిహార్‌లో దారుణ ఘటన..పరీక్షకు హాజరైన అభ్యర్థిపై అంబులెన్సులో అత్యాచారం

Bihar: హోంగార్డు పరీక్షకు హాజరైన ఓ యువతిపై అంబులెన్సులో అత్యాచారం జరిగిన ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2025-07-26 06:30 GMT

Bihar: బిహార్‌లో దారుణ ఘటన..పరీక్షకు హాజరైన అభ్యర్థిపై అంబులెన్సులో అత్యాచారం..ఇద్దరు అరెస్ట్

Bihar: హోంగార్డు పరీక్షకు హాజరైన ఓ యువతిపై అంబులెన్సులో అత్యాచారం జరిగిన ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధ్ గయ పరిధిలోని పరేడ్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన హోంగార్డు ఫిజికల్ టెస్ట్‌కు హాజరైన స్థానిక యువతి పరీక్షల సమయంలో సృహ తప్పి కుప్పకూలింది.

ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాల్సిందిగా అధికారులు సూచించడంతో, ఘటనా స్థలంలో ఉన్న అంబులెన్స్‌లో ఆమెను తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి తరలించే మార్గంలో, అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఈ నేరం రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితురాలికి న్యాయం అందేలా చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News