Bhajan Lal Sharma: రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

Bhajan Lal Sharma: హాజరైన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు

Update: 2023-12-15 10:07 GMT

Bhajan Lal Sharma: రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

Bhajan Lal Sharma: రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా.. భజన్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వాల ప్రమాణం చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పలువురు నేతలు పాల్గొన్నారు. రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాత్‌ హాజరయ్యారు.

Tags:    

Similar News