బ్యాంకులకు వరుసగా సెలవులు... అప్రమత్తమవండి

బ్యాంకులకు వరుసగా సెలవులు... అప్రమత్తమవండి బ్యాంకులకు వరుసగా సెలవులు... అప్రమత్తమవండి

Update: 2019-09-20 05:56 GMT

ఈ నెలలో బ్యాంకులకు వరుసగా ఐదురోజులు సెలవులు వస్తున్నాయి. 26 నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేస్తామని బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి, అలాగే 28వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు కాగా.. 29 ఆదివారం సాధారణ సెలవు ఉంది. ఈ నాలుగు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ నెల 30న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. ఆ రోజూ లావాదేవీలు ఉండవు. దీంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి.

ఆ తర్వాత అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు పని చేస్తాయి. అయితే ఆ వెంటనే అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు మళ్ళీ సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకులకు ఆరు రోజుల సెలవులు వచ్చినట్టయింది. దీంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిని ముందుగానే తెలుసుకుంటున్న ఖాతాదారులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. 

Tags:    

Similar News