ఉత్తరాఖండ్‌లో తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు
Badrinath: విష్ణువుగా కొలువై ఉన్న శ్రీ బద్రీనాథ్
ఉత్తరాఖండ్‌లో తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు
Badrinath: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ తలుపులు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో విష్ణువు శ్రీ బద్రీనాథుడిగా కొలువై ఉన్నాడు. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఆలయాన్ని చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు. ఓ వైపు వేద పండితుల మంత్రోచ్ఛరణ, మరో వైపు ఆర్మీ బ్యాండ్, సాంప్రదాయ డప్పుచప్పుళ్లతో ఆలయ తలుపులు తెరిచారు. ఆలయం తెరిచే సందర్భంగా ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు బద్రీనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తిరిగి నవంబర్ 18 నుంచి ఆలయాన్ని మూసివేస్తారు.