ఆర్పీఎఫ్ సిబ్బందికి సెలవులు రద్దు

Update: 2019-11-07 14:54 GMT

దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఆయోధ్య రామ్ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం 40 రోజులు వరసగా విచారణ చేసింది. అక్టోబరు 16న ఇరు పక్షాల వాదనలను విన్న కోర్డు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అయితే తీర్పును ఈనెల 17న వెలువడనుంది అదే రోజు రంజన్ గొగొయ్ పదవీవిరమణ చేయనున్నారు‎.ఈనేపథ్యం టీవి చర్చ కార్యక్రమాలు , రెచ్చకొట్టే ప్రసంగాలు చేయకుడదని పోలీసులు పలు ఆంక్షలు విధించారు. సామాజిక మాధ్యమాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

ఈనేపథ్యంలో ఆర్పీఎఫ్ అప్రమత్తమైంది. దేవవ్యాప్తంగా అన్ని జోన్ల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు నేపథ్యంలో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. రైల్వేస్టేషన్లు , యార్డులు , పార్కింగ్ , స్థలాలు, జనసంచారం ఉన్న ప్రదేశాలు అన్నిటి దగ్గర భద్రత కట్టుదిట్టంచేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చూస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. యూపీలోని 78 ప్రధాన రైల్వే కూడల్లో ఆర్పీఎప్ సిబ్బందిని నియమించింది. కేంద్ర హోంశాఖసైతం ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. 

Tags:    

Similar News