ఎట్టకేలకు పట్టుబడ్డ 'లాడెన్' ఏనుగు

అసోంలో ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తూ, పలువురి ప్రాణాలు తీసిన ఓ ఏనుగును అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

Update: 2019-11-12 15:49 GMT
Laden A Rogue Elephant

అసోంలో ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తూ, పలువురి ప్రాణాలు తీసిన ఓ ఏనుగును అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అక్కడి ప్రజలు దానిని ఓ ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. అది ఎవరిపేరో కాదు అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ పేరు ఆ ఏనుగుకు పెట్టారు. ఇంతకీ ఎంటా ఆ ఏనుగు కథా అనుకుంటున్నారా. అసోంలోని గోల్పారా జిల్లాలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూంది. అక్టోబర్‌ నెలలో ఆ ఏనుగు ఐదుగురు గ్రామస్తులను చంపింది. దీంతో ఈ లాడెన్‌ను పట్టుకునేందుకు అధికారులు ఓ ప్రత్యేక ఆపరేషన్‌ కూడా చేపట్టారు. ఎట్టకేలకు ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని, ఏనుగు పట్టుబడిందని అధికారులు తెలిపారు.

ఈ ఏనుగును పట్టుకోవడానికి డ్రోన్ కెమెరాలు, పెంపుడు ఏనుగులను ఉపయోగించామని అధికారులు వెల్లడించారు. ఈ ఏనుగును పట్టుకోవడాని నిపుణులైన షూటర్లుతో కలిసి ఆపరేషన్ కొనసాగించామని అది కనిపించిన వెంటనే బాణాలతో మత్తు ఇచ్చి పట్టకున్నామని తెలిపారు. పట్టుబడ్డ లాడెన్ ను అడవికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అక్టోబరు 24న ఒక రోజులోనే ముగ్గురిని చంపింది. గత పదేళ్లలో ఏనుగుల దాడిలో రెండు వెల మంది ప్రాణాలు విడిచారని తెలిపారు. 

Tags:    

Similar News