Delhi Assembly Election Results 2025: కేజ్రీవాల్ సహా ఓడిన ఆప్ ప్రముఖులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమాగా ఉన్న ఆప్‌నకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది.

Update: 2025-02-08 07:40 GMT

 కేజ్రీవాల్ సహా ఓడిన ఆప్ ప్రముఖులు

Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమాగా ఉన్న ఆప్‌నకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్‌పుర‌లో మనీశ్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్ విజయం సాధించారు. ఆప్ నేత సోమనాథ్ భారతీ కూడా ఓడిపోయారు.ఢిల్లీ సీఎం అతిశీ కల్కాజీ స్థానం నుంచి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదటి నుంచి వెనుకంజలో ఉన్న అతిశీ..చివరి రౌండ్‌లో పుంజుకుని గెలుపు వైపు దూసుకెళ్లారు.

గత ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లకు‌ గాను ఆప్ 67 సీట్లు సాధించి బంపర్ విక్టరీ కొట్టింది. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓటమిపాలు అయ్యారు. అయితే ఆప్ ఓటమికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రధాన కారణం అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News