Arvind Kejriwal: వచ్చే ఏడాది మోడీకి 75 ఏళ్లు నిండుతాయి.. అప్పుడు పదవీ విరమణ చేస్తారా?

Arvind Kejriwal: బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు పదవీ విరమణ చేస్తారా?

Update: 2024-05-11 11:23 GMT

Arvind Kejriwal: వచ్చే ఏడాది మోడీకి 75 ఏళ్లు నిండుతాయి.. అప్పుడు పదవీ విరమణ చేస్తారా?

Arvind Kejriwal: బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు పదవీ విరమణ చేస్తారా? బీజేపీ ప్రధానిగా ఎవరు ఉంటారు? అని ప్రశ్నించారు. ఇండియా బ్లాక్‌ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ అడుగుతోందని... అయితే వారి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీని తాను అడుగుతున్నానని అన్నారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీలోని నేతలు రిటైర్ కావాలన్న నిబంధన మోదీ పెట్టారని చెప్పారు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా రిటైర్ అయ్యారని.. అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17న మోదీ రిటైర్ కాబోతున్నారా? అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Tags:    

Similar News