Army Jobs: పదో తరగతితో ఆర్మీ ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేయండి..
Army Jobs: పదో తరగతితో ఆర్మీ ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేయండి..
Army Jobs: పదో తరగతితో ఆర్మీ ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేయండి..!
Army Jobs: పదో తరగతి చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఆర్మీలో ఉద్యోగం సంపాదించే అవకాశం వచ్చింది. జబల్‌పూర్ లోని గ్రనైడర్స్ రెజిమెంటల్ సెంటర్ కమాండెంట్ కార్యాయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య 14. కుక్-9, టెయిలర్-1, బార్చర్-1, రేంజ్ చౌకీదార్-1, సాఫాయివాలా-1 ఉన్నాయి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.18,000ల నుంచి రూ.19,900ల వరకు చెల్లిస్తారు. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.
అలాగే సంబంధిత పనిలో ఏడాది పాటు అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. The Commandant, GRENADIERS Regimental Centre, Jabalpur (MP) PIN – 482001 అప్లికేషన్ పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 12, 2022గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.