జమ్మూకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి రెచ్చిపోయారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంటిమీద నుంచి కాల్పులకు తెగబడ్డారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి రెచ్చిపోయారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంటిమీద నుంచి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఓ పోలీస్ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారాలో చోటుచేసుకుంది. అక్కడ ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించిన తరువాత శనివారం మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు బయటపడి ఇంటి లోపలే దాక్కున్నారు.
ఈ క్రమంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆఫ్ పోలీసుల బృందాలు ఇంటిని చుట్టుముట్టాయి.. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతం చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు.. అయితే కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు ఒక కల్నల్, ఒక మేజర్, ఇద్దరు సైనికులు పోలీసు అధికారిని కాల్చారు. అయితే మనవాళ్ళు కూడా అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇంటిపైన దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేయడంతో ఇద్దరు హతమయ్యారు.
కాగా కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్, లాన్స్ నాయక్, రైఫిల్‌మన్, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ షకీల్ ఖాజీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందారు. ఇక ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాత్రంతా ఫేస్‌బుక్ , టెలిగ్రామ్‌లలో అనేక మంది పాకిస్తానీయులు ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. కాగా గత 15 రోజులకుగా కశ్మీర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు కాల్పులకు దిగుతున్న విషయం తెలిసిందే.