వాయు కాలుష్యం నుంచి దేవుడిని రక్షిస్తున్న భక్తులు

Update: 2019-11-06 07:46 GMT
Varanasi

ఉత్తర భారతదేశాన్ని వాయు కాలుష్యం వణికిస్తుంది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఉత్తరప్రదేశ్ లో దేవుళ్లలకు వాయు కాలుష‌్యం తాకింది. దీంతో వారణాసిలో దేవుడి విగ్రహాలకూ మాస్కులు పెడుతున్నారు. వీటి వల్ల దేవుడిని వాయు కాలుష్యం నుంచి రక్షించించిన వాళ్లం అవుతామని భక్తులు అంటున్నారు. దీపావళి పండుగ తర్వాత వాయుకాలుష్యం ఉత్తరాది రాష్ట్రాల్లో తారా స్థాయికి చేరింది. దీంతో అక్కడ ప్రజలు మొహాలకు మాస్క్ లు ధరించి బయటకు వస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని సిగర్ ప్రాంతంలోకి శివపార్వతి మందిరంలో భగవంతుల విగ్రహాలకు అక్కడి పూజారులు, మాస్క్‌లు కట్టారు. పూజారి విశ్రా మాట్లాడుతూ.. ఇక్కడి భక్తులు అంతా భగవంతుడిని మనుష్య రూపంలో కొలుస్తారు. అందుకే భానుడి వేడి నుంచి విగ్రహాలను కాపాడటానికి చందనం రాసామని తెలిపారు. చలికాలంలో చలి నుంచి దేవుడిని రక్షించడానికి చలికోట్లు వేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం వాయు కాలుష‌్యం అధికంగా ఉండడంతో దాని బారి నుంచి భగవంతుడిని రక్షించడానికి మాస్క్ లు వేస్తున్నామని పూజారి మిశ్రా తెలిపారు.

ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. సుప్రీం కోర్టు ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో చెత్త తగలబెట్టకుడదని ఆదేశించింది. అక్కడ ప్రభుత్వం వాహనాలకు సరి-బేసి విధానంలో నిబంధనలు జారీ చేసింది. సీఎం కేజ్రీవాల్, కేబినెట్ మంత్రులతో సహా అందరూ ఈ నిబంధనలు పాటిస్తున్నారు. కాలుష్యం ఢిల్లీనే కాదు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

Tags:    

Similar News