సర్కారకు వ్యతిరేకంగా ఆందోళన... 60 మంది మృతి

ఇరాక్‎లో ప్రధాని అదిల్ అబ్దెన్ మహ్దీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో దాదాపు 60మందికి పైగా మృతి చెందారు.

Update: 2019-10-05 07:14 GMT

ఇరాక్‎లో ప్రధాని అదిల్ అబ్దెన్ మహ్దీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో దాదాపు 60మందికి పైగా మృతి చెందారు. మరో రెండు వేల మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సమస్య విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు మొఖ్తదా అల్ సదర్ నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజలు అందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నసీరియాహ్, బాగ్థాద్ నగరాల్లో అల్లర్లు హెచ్చుమారాయి. ప్రభుత్వం స్పందించే వరకు అన్ని రకాల సమావేశాలను బహిష్కరిస్తారని ప్రకటించారు. 

Tags:    

Similar News