కచా బాదమ్ తర్వాత పాపులర్ అవుతున్న మరో పాట

*సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంగూర్ సాంగ్

Update: 2022-03-30 09:14 GMT

కచా బాదమ్ తర్వాత పాపులర్ అవుతున్న మరో పాట 

Angoor Song: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు హీరోలవుతారో ఎవరు ఎందుకు స్టార్లు అవుతారో ఊహించలేం కొందరు ఓవర్ నైట్ స్టార్లు అవుతుంటారు. దాని వెనుక చాలా శ్రమే ఉంటుంది. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రోడ్ సైడ్ వెండార్లు సైతం సూపర్ స్టార్‌లు అవుతారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బుబన్ బదేకర్ కచా బాదమ్ కచా బాదమ్ అంటూ యమ పాపులర్ అయ్యాడు. ఆయన పాట మరచిపోకముందే ఇప్పుడు అదే స్టైల్లో అంగూర్ జింగల్ మస్తు ప్రచారమవుతోంది.

సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, వింతలు, విశేషాల వీడియోలు తరచూ చూస్తూంటాం. ఆశ్చర్యం కలిగించేలా పాడినా, నృత్యం చేసినా అవి సంథింగ్ సన్సేషన్ అవుతుంటాయ్. చిన్న ట్యూన్ ఇచ్చే థ్రిల్ అంత గొప్పగా ఉంటుంది మరి ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక పల్లె పాటలకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. జింగిల్ లాంటి సింపుల్ ట్యూన్స్ కూడా ఇంటర్నెట్ యూజర్లకు ఆనందాన్నిస్తున్నాయ్. బుబన్ బదేకర్ పల్లీలు అమ్ముకునేందుకు చేసిన చిరు ప్రయత్నం కచా బాదమ్ ఆ నోటా ఈనోటా ఇంటర్నెట్‌లో తుఫానుగా నిలిచింది. పాట రీమిక్స్‌లు బుబన్ బదేకర్ కు ఇన్‌స్టాంట్ స్టార్‌డమ్‌ తీసుకువచ్చాయ్. కచా బాదమ్ వీడియోలు లక్షల మంది వీక్షించడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

ఇప్పుడు అదే తరహాలో ద్రాక్ష పండ్ల అమ్మకందారు ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ హిట్టయ్యాడు. ద్రాక్ష అమ్మే వ్యక్తి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సాలిమినాయత్ అనే యూజర్ షేర్ చేశారు. ఇది పోస్ట్ చేసిన కొద్దిసేపటికే 25 లక్షల మంది వ్యూయర్లు వీడియోను వీక్షించారు. నల్ల ద్రాక్షతో కూడిన బండి పక్కన ఒక ముసలి వ్యక్తి ద్రాక్షను అమ్మడానికి జింగిల్‌ పాడుతున్నాడు. ద్రాక్ష కొనేందుకు కష్టమర్లకు ఈజీగా నోట్ అయ్యేలా 15 రూపాయలకే 12 అంగూర్లంటూ గీతాన్ని ఆలపిస్తున్నాడు. అయితే ఈ పాట పాడుతుందెవరు ఎక్కడ్నుంచి పాటను రికార్డ్ చేసారన్నది కూడా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News