Punjab: ఖలిస్తానీ సానుభూతి పరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్.. రేపటి వరకు ఇంటర్నెట్ సేవల్ బంద్
Punjab: తాజా పరిస్థితులపై కేంద్రానికి నివేదిక పంపిన పంజాబ్ సీఎస్
Punjab: ఖలిస్తానీ సానుభూతి పరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్.. రేపటి వరకు ఇంటర్నెట్ సేవల్ బంద్
Punjab: ఖలిస్థానీ అనుకూల వారీస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అజ్నాలా పీఎస్ దగ్గర..విధ్వంసం సృష్టించిన కేసులో అయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారనే సమాచారంతో అమృత్ పారిపోయినట్లు తెలిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బలగాలు..దాదాపు 100 వాహనాల్లో అతడిని వెంబడించారు. చివరకు జలందర్‌లోని నాకోదార్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతడి అనుచరుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌పాల్ అరెస్ట్ నేపథ్యంలో..పంజాబ్‌లోని పలు జిల్లాల్లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయాలని పోలీసులు ఆదేశించారు. రాష్ట్ర ప్రజలు ఎలాంటి హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా ఉండాలని పంజాబ్ పోలీసులు కోరారు. విద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దంటూ..పౌరులకు విజ్ఞప్తి చేశారు.