బెంగాల్‌కు రూ.1000 కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ

ఒక పక్కా కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్కా ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడుతోంది.

Update: 2020-05-22 09:21 GMT
PM Modi(File photo)

ఒక పక్కా కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్కా ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడుతోంది. ఈ తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది మరణించారు మరియు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనితో వారికి అక్కడి ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయలను ఇప్పటికే పరిహారంగా ప్రకటించగా, తాజాగా తుఫాను వల్ల నష్టపోయిన పశ్చిమ్ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్ల మంజూరు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు.

తుఫాను నేపథ్యంలో అక్కడి పరిస్థితిని తెలుసుకోవడానికి శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలపై వైమానిక సర్వేలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోడీ తుఫాను వల్ల కలిగే నష్టం, ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితుల గురించి సమగ్ర సర్వే నిర్వహించడానికి ఒక బృందాన్ని పంపుతామని వెల్లడించారు. అంతేకాకుండా వారికి అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయాని వెల్లడించాడు. ఈ తుపాను తీవ్రతకు మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు.

ఇక ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన ప్రశంసలు గుప్పించారు. ఉంఫాన్ తుఫాను సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తన వంతు కృషి చేస్తోందని కితాబిచ్చారు. అనంతరం మోడీ బెంగాల్ నుంచి ఒడిశాకు బయల్దేరారు. అక్కడ తుపానుతో నెలకొన్న నష్టాన్ని పరిశీలించనున్నారు. 

Tags:    

Similar News