Amphan Cyclone: ఉంఫాన్ తుఫాను తీరం దాటేది ఇక్కడే..

ఉంఫాన్ తుఫాను ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రం బెంగాల్‌లో ల్యాండ్‌ఫాల్ (తీరం దాటడం) అవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

Update: 2020-05-20 05:55 GMT

ఉంఫాన్ తుఫాను ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రం బెంగాల్‌లో ల్యాండ్‌ఫాల్ (తీరం దాటడం) అవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తుఫానుపై ఒడిశాలోని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికె జెనా మాట్లాడుతూ.. తుఫాను పారాడిప్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని.. 18 నుండి19 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని.. ఒక గంట క్రితం, పారాడిప్ వద్ద 102 కిలోమీటర్ల వేగంతో గాలి వేగం గమనించబడిందని అన్నారు..

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ సమీపంలో ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని ఈ తుఫానుకు సంబంధించి రాబోయే 6 గంటలు కీలకం అవుతాయి అని అన్నారు. కాగా ఈ రోజు ఉదయం 8:30 గంటలకు ఒడిశాలోని పారదీప్‌కు తూర్పు-ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతం అయిందని.. ఇది పశ్చిమ బెంగాల్‌లోని దిఘా , బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు దగ్గరగా ఉంటుందని.. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే తుఫాను దృష్ట్యా ప్రత్యేక విమానాలతో సహా అన్ని కార్యకలాపాలను కోల్‌కతా విమానాశ్రయం రద్దు చేసింది. ఈ రద్దు రేపు తెల్లవారుజాము 5 గంటల వరకు ఉంటుందని ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


Tags:    

Similar News