జార్ఖండ్‌ అసెంబ్లీ ఫలితాలపై స్పందించిన అమిత్ షా

Update: 2019-12-23 15:12 GMT
JHARKHAND

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో బీజేపీ నాయకత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ బీజేపీ ఓటమికి తనదే పూర్తి బాద్యత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఓటమి కేవలం తనది మాత్రమేనని, బీజేపీది కాదని చెప్పారు.

ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్రహోం మంత్రి అమిత్ షా స్పందించారు. జార్ఖండ్‌ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ట్వీట్ చేశారు. జార్ఖండ్‌ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీని ఇప్పటి వరకు ఆదరించినందుకు జార్ఖండ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా ట్విట్ చేశారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి పరిపాలన అందిచాలని కోరుతున్నామని ట్వీట్ చేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ - జేఎంఎం కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి 46 స్థానాల్లో కైవసం చేసుకున్నట్లు సమాచారం. 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించినట్లు తెలుస్తోంది. మిగతా ఇతరులు స్థానాల్లో విజయం దిశగా పయనిస్తున్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఎన్నిక కానున్నారు. 1975 ఆగస్టులో 10న రామ్‌ఘర్ జిల్లాలో హేమంత్ జన్నించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2005 ఎన్నికల్లో దుమ్కా నుంచి పోటీ చేసిన హేమంత్ రెబల్ అభ్యర్థి స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి చెందారు. 2009 హేమంత్ సోదరుడు మృతితో పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించారు. 2009 నుంచి 2010 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అర్జున్ ముండా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2013 సీఎంగా ఎన్నికైయ్యారు హేమంత్ సోరెన్ 38ఏళ్లకే బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మరోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.



 

Tags:    

Similar News