పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కితగ్గే ప్రసక్తి లేదు : అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కి తగ్గేది లేదని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Update: 2019-12-17 15:20 GMT
Amit shah File Photo

 పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కి తగ్గేది లేదని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని దేశంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తిన తరుణంలో అమిత్ షా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ద్వారకాలో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్ని అవాంతరాలు వచ్చిన ఇతర దేశం నుంచి వచ్చే శరణార్ధులకు భారత దేశ పౌరసత్వం కల్పించి వారిని భారతీయులుగా జీవించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

మతపరమైన వివక్షను ఎదుర్కొంటూ పొరుగు దేశాల నుంచి భారత దేశానికి వలస వచ్చే వారికి దేశ పౌరసత్వం ఇచ్చేందుకు మోదీ సర్కార్ పూనుకుంటుందని తెలిపారు. ఈ చట్టంతో దేశంలో ఒక్కరికూడా జాతీయతా కోల్పోవడం జరగదని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు, విద్యార్ధులుకు విన్నవిస్తున్నా ఈ చట్టం వలన ఎలాంటి భయంల అవసరం లేదని, ఏఒక్కరు కూడా పౌరసత్వం కోల్పోరు అంటూ హామీ ఇచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టంపై ఎలాంటి భయం అవసరం లేదని, దాని గురించి పూర్తి వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉందని దానిని పరిశీలించ వచ్చని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ విపక్షాలను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తుందని అమిత్ షా తన ప్రసంగంలో తెలిపారు.

కాగా..ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని జఫ్రాబాద్‌ లో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్ధుల నిరసన ప్రదర్శన సీలంపూర్‌ నుంచి ఫ్రాబాద్‌ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. 

Tags:    

Similar News